సంగారెడ్డి జిల్లా ఫసల్వాది వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్పై వెళ్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకుని యూపీకి చెందిన అవిదేశ్ (35) మృతి చెందాడు. గొంతు తెగిపోవడంతో అతడు స్థానికంగానే ప్రాణాలు కోల్పోయాడు.
చైనా మాంజా ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.