Homeఎడ్యుకేషన్ఛత్రపతి శివాజి చరిత్ర

ఛత్రపతి శివాజి చరిత్ర

ఛత్రపతి శివాజి: పశ్చిమ భారతదేశానా మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన చత్రపతి శివాజీ అసలు పేరు శివాజీ రాజే భోంస్లే.

నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం, తాను చేసే పనిపట్ల అంకితభావం కలిగి ఉండటం, మచ్చలేని వ్యక్తిత్వం ఇవన్నీ శివాజీని ఆయన అనుచరులకు మరియు ప్రజలకు ఆదర్శంగా నిలిచేలా చేశాయి.

చత్రపతి శివాజి పట్టాభిషేకం 1674వ సంవత్సరంలో హిందూ నెల ప్రకారం జేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు జరిగింది. కావున ఆ రోజును హిందూ సామ్రాజ్య దివాస్ గా జరుపుకుంటారు.

జననం – బాల్యం:

చత్రపతి శివాజి మహారాష్ట్రలో వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందిన షాహాజీజిజియాబాయి దంపతులకు క్రీ.శ 1630 ఫిబ్రవరి 19న వైశాఖ మాసపు శుక్లపక్ష తదియ నాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర ఉన్న శివనేరి కోటలో జన్మించాడు.

శివాజి తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశమునకు చెందిన ఆడపడుచు.

శివాజి కంటే ముందు జన్మించిన వారంతా మృతి చెందడంతో ఆమె పూజించే దేవతైన శివై పార్వతి పేరు శివాజికి పెట్టింది.

చిన్నపటి నుంచే శివాజికి తన తల్లి జిజియాబాయి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలిగే విధంగా విద్యాబుద్దులు నేర్పింది.

భారత రామాయణం, బలిచక్రవర్తి కథలు చెప్పి శివాజీలో వీర లక్షణాలు మొలకింప చేసింది.

శివాజీ పరమత సహనం, స్త్రీలను గౌరవించడం ఇవన్నీ తన తల్లి వద్ద నేర్చుకున్నాడు.

Advertise with Us

తన తండ్రి జీవితకాలంలో ఎదురుకున్నా పరాజయాలను క్షుణ్నంగా అధ్యయనం చేసి వాటి నుంచి పాఠాలను నేర్చుకొని, శివాజి అనతి కాలంలోనే యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు.

అతి తక్కువ వయస్సులోనే సకల విద్యలు నేర్చుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే తన లక్ష్యంగా భావించి వ్యూహాలు మొదలు పెట్టాడు.

ఛత్రపతి శివాజి సైన్యం:

చత్రపతి శివాజి భవానీదేవి భక్తుడు. తన సామ్రాజ్యంలో అన్ని మతాల వారిని సమానంగా చూశాడు. కేవలం ఆలయాలు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు.

శివాజి సైన్యంలో మూడోవంతు సైన్యం ముస్లింలే ఉన్నారు. యుద్ధం కోసం పటిష్టమైన నౌక దళాన్ని, అశ్విక దళాన్ని ఏర్పాటు చేశాడు.

శత్రువులందరూ వెనకాడే విధంగా తాను మరణించే నాటికి లక్ష మంది సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు శివాజీ.

ఛత్రపతి శివాజి నిర్మించిన కోటలు:

ఛత్రపతి శివాజి కొండలపై ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేద్యమైన కోటలను నిర్మింప చేయడంలో ప్రపంచ ఖ్యాతి పొందాడు.

నాసిక్ నుండి జింగి వరకు 1200 కిలోమీటర్ల మధ్య 300 కోటలు నిర్మించబడ్డాయి.

శివాజీ మరణించె నాటి వరకు ఈ 300 కోటలు తన ఆధీనంలో ఉండేవి .

ఛత్రపతి శివాజి పరిపాలన:

ఛత్రపతి శివాజి పదిహేడేళ్ళ వయసులో మొట్టమొదట యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తొర్నా కోటను సొంతం చేసుకున్నాడు.

రాజ్ ఘడ్ కోటలను సొంతం చేసుకొని మూడేళ్లలో పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.

ఛత్రపతి శివాజి యుద్ధపద్ధతులు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతనిని ఓడించడానికి ఉన్న ఏకైక మార్గం యుద్ధ భూమి అని తలచి తన ఇష్టదైవమైన భవాని దేవి ఆలయాలన్నింటిని కూల్చాడు.

ఈ విషయం తెలుసుకున్న శివాజీ తాను యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు.

శివాజిని ఎలాగైనా అణచి వేయాలనే ఆలోచనతో బీజాపూర్ సుల్తాన్ యుద్ధ వీరులు గా పేరు తెచ్చుకున్న ఆఫ్జన్ పస్థున్ సైనికులను శివాజీ మీదికి పంపించగా వేల సంఖ్యలో ఉన్న శివాజీ సైన్యం వారిని చంపి విజయం సాధించారు.

హర హర మహాదేవ

ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశం అంతటా వ్యాపించి ఎందరో హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచాడు.

యుద్ధరంగంలో శివాజీ “హర హర మహాదేవ” అంటూ విజృంభించి, శత్రువులని ఊచకోత కోశాడు.

దీంతో కేవలం సుల్తానులే కాక మొగల్ చక్రవర్తి అయినా ఔరంగజేబు కు సైతం శివాజీ అంటే భయం పుట్టింది.

1664 నాటికి ప్రదాన వ్యాపార కేంద్రంగా ఉన్నా సూరత్ పైన శివాజి దాడి చేసి వాళ్ళ ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నాడు.

తర్వాతి కొద్దిరోజులలో మొగలులు, బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టారు. ఔరంగజేబు మొదట శివాజీని చంపాలని నిర్ణయించుకున్న మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతాయని తీసుకొని శివాజిని బందిగా ఉంచాలని భావించాడు.

1666 లో ఔరంగజేబు 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని అతని కొడుకు శంభాజిని ఆగ్రాకు ఆహ్వానించి, సభలో శివాజిని సైనికాధికారుల వెనక నిలబెట్టి అవమానపరిచాడు.

ఇది సహించలేని శివాజీ బయటకు వెళ్తుండగా భటులు చుట్టుముట్టి శివాజీని అతిథి గృహానికి తీసుకెళ్లి బంధీ చేశారు. ఎలాగయినా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు.

ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్ళను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీర్ లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. అలా కొన్ని నెలలు గడిచాక శివాజీ పనిమనిషిగా మారువేషం వేసుకొని కొడుకును బుట్టలో పెట్టుకుని తప్పించుకున్నాడు.

మొగలు సైన్యాధిపతులైన మహబత్ ఖాన్, బహదూర్ ఖాన్, దిలేవార్ ఖాన్ మూకుమ్మడిగా శివాజీ పై దాడి చేశారు. కాని, వారి ఎత్తులు పారలేదు. యుద్ధంలో వీరు శివాజీ తో ఘోర పరాజయం పొందారు. ఈ విజయాన్ని శివాజీ జీవిత చరిత్రలోనే ముఖ్యమైన విజయంగా చెప్పవచ్చు.

ఛత్రపతి శివాజి తుది శ్వాస:

రాయఘడ్ కోటలో జూన్ 6, 1674 న వేద పట్టణాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ ఆదిపతిగా కీర్తిస్తూ “చత్రపతి” అనే బిరుదును ప్రదానం చేశారు.

కేవలం యుద్ధ తంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజి భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజలకోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి ఈ ప్రజల సంక్షేమం కోసం పాటు పడ్డాడు.

8 నెలల పాటు పంటలను పండించే రైతులు నాలుగు నెలలలో యుద్ద నైపుణ్యాలు నేర్చుకోవడం శివాజీ విధానాలకు అద్దం పడుతుంది.

27 ఏళ్లపాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి, సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన చత్రపతి శివాజీ మూడు వారాలపాటు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3 1680 న మధ్యాహ్నం 12 గంటలకు రాయఘడ్ కోటలో తుది శ్వాస విడిచాడు.

డా. బాబా సాహెబ్ అంబేద్కర్ చరిత్ర

గ్రామాలలో పంచాయతీ ఎలా వచ్చింది?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments