ఈ రోజు నగర కమీషనర్ చాహత్ బాజ్ పాయ్ గారు మేయర్ గుండుసుధారాణి గారితో కలిసి బాలసముద్రం వెహికల్ షెడ్‌ను సందర్శించి GWMC లోని 66 డివిజన్‌లలో జేసీబీ, సక్షన్ వాహనాల వినియోగానికి షెడ్యూల్ రూపొందించి, ప్రతి రెండు సర్కిళ్లకు (6) జేసీబీలు అందుబాటులో ఉంచి ప్రతి 15 రోజులకు ఒక్కో డివిజన్‌లో ప్రత్యేకంగా వినియోగించాలని,

నీరు నిలిచే ప్రాంతాల్లో సక్షన్ వాహనాల ద్వారా తొలగింపు చేపట్టి వాటి కదలికలను ICCCకి అనుసంధించాలని, డంప్ యార్డులు, ట్రాన్స్‌ఫర్ స్టేషన్లలో పంక్చర్ యూనిట్లు ఏర్పాటు చేసి చెత్త వాహనాలకు మొబైల్ మరమ్మత్తు వాహనం ద్వారా అత్యవసర సేవలు అందించాలని, మైక్ లేని స్వచ్ఛ ఆటోలకు వెంటనే మైక్ సెట్లు ఏర్పాటు చేసి తడి–పొడి చెత్త వేరు చేసేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించడం జరిగినది.