Homeవరంగల్BJYM ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

BJYM ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

సర్దార్ @150 ఉత్సవాలలో భాగంగా BJYM ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ.

హనుమకొండ: అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన BJYM రాష్ట్ర అధ్యక్షులు కుండె గణేష్.

హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి హంటర్ రోడ్ సత్యం కన్వెన్షన్ హాల్ వరకు సాగిన బైక్ ర్యాలీ.

సత్యం కన్వెన్షన్ హాల్ లో జరిగిన BJYM వరంగల్ పార్లమెంట్ స్థాయి విస్తృత కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న BJYM రాష్ట్ర అధ్యక్షులు కుండె గణేష్.

బిజెవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షులు తీగల భరత్ గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రగోళ్ల భరత్ వీర్ యాదవ్ ఆధ్వర్యంలో BJYM రాష్ట్ర అధ్యక్షులకు ఘన స్వాగతం పలికిన యువ మోర్చ నాయకులు, కార్యకర్తలు.

BJYM రాష్ట్ర అధ్యక్షులు కుండె గణేష్ గారి కామెంట్స్:

భద్రకాళీ అమ్మవారి ఆశీస్సులతో జిల్లాల పర్యటన ప్రారంభిస్తున్న.

పొరుగల్లు ఓరుగల్లు నుండి నా మొదటి పర్యటన ప్రారంభించడం సంతోషంగా ఉంది.

BJYM Meeting

నీళ్లు, నిధులు, నియామకాల కోసం బలిదానాలు చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం.

అయ్యా కొడుకులు 10 సంవత్సరాలు పాలించి అందినకాడికి దోచుకుని తెలంగాణ యువతను మోసం చేశారు.

ఏం సాధించాడు అని రేవంత్ రెడ్డి విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్ అంటేనే, అవినీతి, లోపాయికారి ఒప్పందాలు.

బిజెపి అంటేనే కాంగ్రెస్ పార్టీ బయటపడుతుంది.

జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం, అధికార దుర్వినియోగం చేసి గెలిచింది.

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జెండా ఎగురవేయడమే లక్ష్యంగా యువమోర్చ నాయకులు కార్యకర్తలు పనిచేయాలి.

రానున్న రోజుల్లో యువత సమస్యల పై బిజెవైఎం పోరాటాలు ఉదృతం చేస్తాం.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments