చారిత్రక వరంగల్ నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రకాళి అమ్మవారిని భర్త మహాశయులకి విజ్ఞప్తి’ చిత్ర బృందం దర్శించుకుంది. సినిమా విజయాన్ని కాంక్షిస్తూ చిత్ర యూనిట్ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా చిత్ర కథానాయిక డింపుల్ హయతి (Dimple Hayathi) మరియు చిత్ర దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులు ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి, ఆశీర్వచనాలు పలికారు.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ వరంగల్‌లో పర్యటించింది. అమ్మవారి ఆశీస్సులతో సినిమా ఘనవిజయం సాధిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.