Homeఅంతర్జాతీయంబ్యాంక్ గోడకు కన్నం వేసి ₹316 కోట్లు మాయం

బ్యాంక్ గోడకు కన్నం వేసి ₹316 కోట్లు మాయం

జర్మనీలోని గెల్సెన్కిర్చెన్ నగరంలో చారిత్రాత్మక బ్యాంక్ దోపిడీ జరిగింది. దుండగులు పార్కింగ్ గ్యారేజీ నుంచి సురంగం తవ్వి, బ్యాంక్ గోడకు రంధ్రం చేసి లోపలికి చొరబడ్డారు. ఏకంగా 3,200 సేఫ్టీ లాకర్లను పగులగొట్టి, సుమారు ₹316 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. 2,500 మంది ఖాతాదారులు తమ ఆస్తులు కోల్పోవడంతో బ్యాంక్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జర్మనీ నేర చరిత్రలోనే ఇది అతిపెద్ద దోపిడీగా అధికారులు భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments