ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) వారి ప్రాజెక్టు ” ఏ స్టడీ ఆన్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఇన్ ఐపిపిబి” ఎంబీఏ విద్యార్థులు విజయం సాధించి న్యూఢిల్లీ నుంచి ఇంటర్ షిప్ కి సంబంధించిన సర్టిఫికెట్లను పొందారు. ఎంబీఏ ఫైనల్ ఇయర్ కి చెందిన మొత్తం 7 మంది విద్యార్థులు ఈ సర్టిఫికెట్లు పొందారని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ ఎల్. జితేందర్ విద్యార్థులకు తన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందులో చాలా మంది విద్యార్థులు లైవ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కమ్యూనికేషన్ విత్ కస్టమర్స్ ఇన్ వర్కింగ్ బ్యాంక్ సాధించారు అని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ ఎంబీఏ హెచ్ ఓ డి డా. బి.ప్రసాద్, ఫ్యాకల్టీ డా. సురేష్, డా. గిరి ప్రసాద్, డా. సోమశేఖర్, ట్రైనింగ్ ప్లేస్మెంట్ సభ్యులు డాక్టర్ నహీదా పర్వీన్ పాల్గొనడం జరిగింది. ఈ ఇంటెన్షిప్ సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులు ఉప్పు కీర్తన, ఆరే మనీదీప్, నల్ల సంజయ్ చంద్ర, నిహారిక, సంధ్యారాణి, ప్రసన్న సుశ్మితులను కళాశాల యాజమాన్యం అభినందించారు.