యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో అనుదీప్ మరియు కే12 ఆర్గనైజేషన్ ల వారి ఐబిఎం ట్రైనింగ్ ప్రోగ్రాం మరియు పి ఆర్ ఓ పోస్టులకు గాను రిక్రూట్మెంట్ డ్రైవ్ అండ్ సెలెక్షన్ చేపట్టడం జరిగింది అని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జ్యోతి తెలియజేశారు.
కళాశాల ట్రైనింగ్ ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ ఎల్ జితేందర్ విద్యార్థులకు విద్యతో పాటు క్రమశి క్షణ మరియు క్యారెక్టర్ని పెంచుకోవాలని మరియు గోల్స్ ని సాధించే విషయంలో కష్టాలని సంతోషాలని సమానంగా స్వీకరించాలని, కష్టాలకి కృంగి పోవద్దని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అనుదీప్ నుంచి శ్వేత అండ్ విశాల్ సింగ్ కే12 నుంచి శ్రీజ అదిలాపురం, ప్రణయ్ తో పాటు ఎంబీఏ విభాగ అధ్యాపకులు డాక్టర్ ప్రసాద్, డాక్టర్ సురేష్, డాక్టర్ సోమశేఖర్ మరియు డాక్టర్ గిరి ప్రసాద్ అనేకమంది పీజీ , యూజీ కి చెందిన విద్యార్థులు పాల్గొనడం జరిగింది.