భారతదేశ స్వరాజ్యం కోసం ఎందరో నాయకులు ఎన్నో త్యాగాలు చేసి భరత భూమిలో ప్రాణాలు వదిలారు. వారిలో ఒకరైన మన భారతదేశ మొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి దళితుడైనా మన డా.బాబా సాహెబ్ అంబేద్కర్. ఈయన అసలు పేరు భీమ్ రావు రాంజీ అంబేద్కర్.
స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయవాది మరియు రాజ్యాంగ శిల్పి. దళితులపై అంటరానితనాన్ని, కుల నిర్ములన కోసం ఎంతో కృషి చేసిన మొదటి వ్యక్తి మన అంబేద్కర్.
- బాల్యం – అంబేడ్కర్ జయంతి
- మహద్ సత్యాగ్రహం 1927
- గాంధీజీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ మధ్య ఒప్పందం
- అంబేడ్కర్ బౌద్ధమతం స్వీకరించడం
- రాజ్యాంగ మరియు మంత్రివర్గ సభ్యుడిగా అంబేద్కర్
బాల్యం – అంబేడ్కర్ జయంతి
మహర్ కులానికి చెందిన రాంజీ మాలోజీ సక్వాల్, భీమాబాయి ల 14వ ఆఖరి సంతానం భీమ్రావ్ అంబేడ్కర్. ఈయన 1891 ఏప్రిల్ 14న అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్‌లో సైనిక స్థావరమైన ‘మౌ’ ఊరిలో అనగా ఇప్పటి మధ్యప్రదేశ్ లో జన్మించారు.
ఈయన తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో సుబేదారిగా పనిచేసేవాడు.
మొహర్లను అంటరాని వారీగా పరిగణించడం వలన చిన్న ప్రాయం నుండే అంబేద్కర్ అనేక సమస్యలను ఎదురుకున్నాడు.
పాఠశాలలో ఎవరూ కూడా వీరితో మాట్లాడలేకపోవడం, తరగతి గది బయట కూర్చొని పాఠాలు చదవడం, చివరికి తాగే మంచినీళ్లు కూడా స్వయంగా తీసుకోవడానికి వీరికి అనుమతి లేదు.
1912 లో బరోడా మహారాజైన శాయాజీరావ్ గైక్వాడ్ గారు ఇచ్చిన 25 వేల విద్యార్థి వేతనంతో బీ. ఏ పరీక్షలో విజయం సాధించి, పట్టభద్రుడైయ్యాడు.
ఉతిర్ణుడు అయినా వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. కానీ, పై చదువుల మీద ఆసక్తితో ఉద్యోగంలో చేరలేకపోయాడు.
ఈ విషయం పై మహారాజు గారికి విరమించుకొని విదేశాలోలో చదువు పూర్తి చేసి, తర్వాత బరోడా సంస్థానంలో పదేళ్లు పని చేసే షరతుపై 1913 లో రాజుగారి సహాయం వలన కోలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు.
1915 లో ఎం.ఏ, 1916 లో పి.హెచ్.డి పూర్తి చేసి 1917 లో డా. అంబేడ్కర్ గా భారతదేశానికి తిరిగివచ్చాడు.
27 సంవత్సరాలు గల ఒక దళితుడు ఇంత విజయం సాధించడం వివిధ ఇతర వర్గాల వారికీ ఆశ్చర్యం కల్గించింది. అంబేద్కర్ తన 32వ సంవత్సరంలో లండన్ విశ్వవిద్యాలయం నుండి డి. ఎస్.సి, కోలంబియా విశ్వవిద్యాలయం నుండి పి. హెచ్.డి పొందాడు.
మహద్ సత్యాగ్రహం 1927

గుజరాత్ మహద్ లో 1927 సంవత్సరంలో దళిత జాతుల మహాసభ జరిగింది. అంటరాని వారిని చాలామందిని అక్కడ ఉన్న చెరువులోని నీళ్లు త్రాగుటకు అనుమతించనప్పటికిని భీమ్రావ్ అంబేడ్కర్ నాయకత్వంలో చాలా మంది ఆ నీటిని స్వీకరించారు. అదే సంవత్సరంలో ఎంతో ఘనంగా జరిగిన ఛత్రపతి శివాజీ ఉత్సవాలకు సంఘాధ్యక్షుడైనా బాలాయశాస్త్రి అంబేద్కర్ ని ఆహ్వానించారు.
ఆ సభలో భీమ్రావ్ అంబేడ్కర్ ప్రసంగిస్తూ సామ్రాజ్య పతనానికి కారణం అస్పృశ్యతని పాటించడమే అని వ్యక్తం చేశారు.
గాంధీజీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ మధ్య ఒప్పందం
1928 లో సైమన్ కమిషన్ ముగిసిన పిదప, బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సభలను ఏర్పాటు చేసింది.1930,1931 మరియు 1932 లో జరిగిన ఈ మూడు సమావేశాలకు అంబేద్కర్ హాజరయ్యారు. రెండవ సమావేశానికి భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీ హాజరయ్యారు. అయి తే దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు ఇవ్వాలనేది అంబేద్కర్ ఉదేశ్యం. అలా జరిగితే సమాజం విచ్చిన్నమవుతుందన్న ఆలోచనతో గాంధీ ఒప్పుకోకపోవడంతో సమావేశం నుండి బయటకు వచ్చేసారు.
కానీ పూనా పాక్ట్ 1932 లో రామ్సే మెక్ డోనాల్డ్ ప్రకటించిన “కమ్యూనల్ అవార్డు“లో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాన్ని ప్రత్తిపాదించారు. అంబేద్కర్ ఆ సమయంలో గాంధీ శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా ఎరవాడ జైలులో అరెస్ట్ అయి ఉన్నారు, ఈ విషయం తెలిసి గాంధీజీ నిరాహార దీక్ష చేపట్టారు. దీని ప్రభావితమే అంబేద్కర్ పై ఒత్తిడి పెరిగింది. కానీ, చివరికి గాంధీ, అంబేద్కర్ మధ్య పునః ఒప్పందం కుదిరి, కమ్యూనల్ అవార్డు కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజకవర్గంకి ఇవ్వబడ్డాయి.
రాజ్యాంగ మరియు మంత్రివర్గ సభ్యుడిగా అంబేద్కర్
అంబేద్కర్ జీవిత చరిత్రలో రాజ్యాంగాన్ని రచించడం ఒక ముఖ్య భాగం. రాజ్యాంగ రచన సంఘంలోని సభ్యులంతా ఇతరత్ర రాజకీయాలలో, వ్యక్తిగత కార్యాలలో భాగం అయినందున ఆ రాజ్యాంగాన్ని రచించే భారాన్ని అంబేద్కర్ మోయవలసిందిగా టీ. కృష్ణమాచారి (కేంద్ర మంత్రి ) వ్యక్తం చేశారు.
భారత రాజ్యాంగం రచించుటకు 2 సంవత్సరాలు 11 నెలల వ్యవధి పట్టింది. ప్రపంచంలో భారత రాజ్యాంగం వ్రాయబడిన చాలా పెద్ద రాజ్యాంగం.
రెండొవ వివాహం
1948 లో అంబేద్కర్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను వివాహం చేసుకున్నారు. కాగా, మొదటి భార్య రమాబాయి 1935 లో మరణించింది. ఆ తరువాత 1956 లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించారు.
Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.
అంబేడ్కర్ బౌద్ధమతం స్వీకరించడం
హిందూ ధర్మంలో చతుర్వర్ణ వ్యవస్థ & అస్పృశ్యతను తీవ్రంగా వ్యతిరేకించారు
ఆయన జీవితాంతం చూసిన అవమానాలు, కుల వివక్షలు హిందూ ధర్మశాస్త్రాల్లోనే ఉన్నాయని ఆయన నమ్మకం. మనుస్మృతి దళితులను “శూద్రులు-అతిశూద్రులు”గా చూస్తుందని, దాన్ని రూపుమాపలేనంత వరకు సమానత్వం రాదని భావించారు.
ఇతర మతాలను కూడా పరిశీలించారు
క్రైస్తవం → మిషనరీలు ఆకర్షణీయ ఆఫర్లు ఇచ్చారు కానీ “భారతదేశంలో క్రైస్తవులు రెండో తరగతి పౌరులుగానే ఉంటారు” అని తిరస్కరించారు.
ఇస్లాం → సమానత్వం ఉంది కానీ భారతీయ సంస్కృతితో సంబంధం లేదన్నారు.
సిక్ఖం → గురు గ్రంథ సాహిబ్‌లో కొన్ని కుల వివక్షలున్నాయని అనిపించింది.
బౌద్ధ ధర్మంలో ఆకర్షణీయ అంశాలు
సమానత్వం: బుద్ధుడు “ఎవరూ జన్మతః హీనులు కారు, కర్మ వల్లనే” అన్నారు. కులం లేదు, జాతి లేదు.
స్వేచ్ఛ & తర్కం: “నా మాటలను కూడా పరీక్షించి అంగీకరించండి” అని బుద్ధుడు చెప్పాడు – ఇది అంబేడ్కర్‌కి బాగా నచ్చింది.
భారత మూలాలు: బౌద్ధం భారతదేశంలోనే పుట్టిన మతం, విదేశీ మతం కాదు.
అహింస & కరుణ: దళితులు ఎదుర్కొన్న హింసను ఎదుర్కొనే శక్తినిస్తుంది.
1935లోనే ప్రకటన చేశారు
యేవత్మల్ (మహారాష్ట్ర)లో 1935 అక్టోబర్ 13న బహిరంగ సభలో అంబేడ్కర్ ఇలా అన్నారు:
“నేను హిందువుగా పుట్టడం దురదృష్టం… హిందువుగా మరణించను. త్వరలోనే మతమార్పిడి చేస్తాను.”
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్
21 సంవత్సరాల పాటు అధ్యయనం చేసి, 22 బౌద్ధ వ్రతాలు (22 vows) తయారు చేసి, 1956 అక్టోబర్ 14న నాగపూర్ దీక్షాభూమిలో లక్షల మందితో కలిసి బౌద్ధం స్వీకరించారు.
Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.
ఆయన సొంత మాటల్లో (సారాంశం):
“నేనుబౌద్ధంస్వీకరించడంఅంటేఒకమతాన్నిమార్చుకోవడంకాదు… ఇదిదళితులకుమానవహక్కులు, గౌరవం, స్వేచ్ఛఇచ్చేసామాజికవిప్లవం!”
అందుకే ఆయన మరణించిన తర్వాత కూడా లక్షల మంది దళిత-బహుజనులు బౌద్ధం స్వీకరిస్తూనే ఉన్నారు.
అంబేడ్కర్ మహాపరినిర్వాణ దినం – చివరి శ్వాస
1956 డిసెంబర్ 6 న డా. అంబేద్కర్ చివరి శ్వాస విడిచారు. ఒక హిందువుగా పుట్టి బౌద్దునిగా మరణించారు. గౌతమ బుద్ధుడు, బోధిసత్వులు, అర్హంతులు ఈ లోకాన్ని విడిచి పెట్టినప్పుడు దాన్ని “మహాపరినిర్వాణం” అంటారు. ఈయనను భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరుగా ప్రకటించారు. ఎన్నో పోరాటాలు చేసి, భారత రాజ్యాంగ శిల్పిగా ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన అంబేద్కర్ కు భారత ప్రభుత్వం “భారత రత్న ” అవార్డుని, అతని మరణానంతరం ప్రకటించింది.
జై భీమ్