Homeలేటెస్ట్ న్యూస్ఈ రోజు ముఖ్యాంశాలు: 28.11.2025

ఈ రోజు ముఖ్యాంశాలు: 28.11.2025

నటుడు చిరంజీవి ట్రస్ట్‌కు FCRA అనుమతి. విదేశీ విరాళాలు సేకరించేందుకు అనుమతిఇచ్చిన కేంద్రం.

కేసీఆర్ ఉన్నంత వరకే బీఆర్ఎస్ ఆ తర్వాత పార్టీ మూడు ముక్కలు: కడియం శ్రీహరి

జీవో 46పై నేడు హైకోర్టులో విచారణ, పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46ను సవాల్‌ చేస్తూ ప్రజాప్రయోజన వ్యాఖ్యం దాఖలు, బీసీల్లో ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని న్యాయవాది సుదర్శన్‌ పిటిషన్.

సర్పంచ్ ఎన్నికలో సత్త చాటాలి.. రిజర్వేషన్ ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కి బుద్ధి చెప్పాలి అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్ ఈ రోజు (నవంబర్ 28, 2025) 23వ స్నాతకోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తోంది.

ఐ బొమ్మ కేసులో నేడు రెండో రోజు రవి కస్టడీ విచారణ.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్‌ సమ్మిట్‌పై రేవంత్ ఫోకస్‌. నేడు ఎడ్యుకేషన్‌, యూత్, ఇన్‌ఫ్రా విభాగాలపై సమీక్ష.

నేడు హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌కు కిషన్‌రెడ్డి అభివృద్ధి పనులు పరిశీలించనున్న కేంద్రమంత్రి.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments