Homeలేటెస్ట్ న్యూస్అంధుల మహిళ క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి

అంధుల మహిళ క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి

అంధుల క్రికెట్ మహిళల టీ20 ప్రపంచ కప్ (Blind Women’s T20 World Cup)లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

నేపాల్‌లో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో భారత జట్టు ప్రదర్శించిన అసాధారణ ప్రతిభ, పట్టుదల, స్పూర్తిని ముఖ్యమంత్రి గారు ప్రశంసించారు.

ఈ విజయం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందన్నారు. ధైర్యం, క్రమశిక్షణ, అజేయమైన స్పూర్తి ఉంటే కంటి చూపు లేకున్నా రాణించవచ్చని అంధ మహిళల క్రికెట్ జట్టు మరోసారి నిరూపించిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments