వరంగల్: 16 జనవరి 2026.
జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టం పై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి జరిగిన నష్టం అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ బృందం శుక్రవారం వరంగల్ జిల్లాతో పాటు వరంగల్ నగరం జిడబ్ల్యుఎంసి పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది.

నలుగురు ప్రతినిధులు పొన్ను స్వామి, నిశాంత్ మిశ్రా, శశివర్ధన్, రాహుల్ బఖేటి లతో కూడిన కేంద్ర బృందం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్పాయి లతో కలసి వరంగల్ నగరంలోని ఎన్ ఎన్ నగర్, ఎన్టీఆర్ నగర్, మైసయ్య నగర్ , కాలనిలలో పర్యటించి క్షేత్ర స్థాయిలో నీట మునిగిన ఇండ్లు, గృహాలకు వాటిల్లిన నష్టం, వాహనాలు, ఇంటి సామగ్రి నష్టం, నీటి మునిగిన ట్రాన్స్ఫార్మర్స్, పడిపోయిన విద్యుత్ స్తంభాల ప్రాంతాలను కేంద్ర బృందం పరిశీలించి అధికారులకు, స్థానికులను తుఫాను వల్ల జరిగిన నష్టం గురించి ఆడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని చంద్రుగొండ, బొగ్గులకుంట తండా, దీక్ష కుంట గ్రామాల్లో తుఫాను ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో ధ్వంసమైన రోడ్లు కల్వర్టులు, బ్రిడ్జిలకు వాటిల్లిన నష్టం, నీట మునిగిన వరి పంట, ద్వెబ్బతిన్న పంట పొలాలు పశువుల నష్టం, దీక్ష కుంటలో కూలిన ప్రభుత్వ పాఠశాల భవనం లను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. తుఫాను వల్ల వాటిల్లిన పంట నష్టం గురించి కేంద్ర బృందానికి స్థానిక రైతులు వివరించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ ఓ విజయలక్ష్మి, ఎన్ పిడిసిఎల్ ఎస్ ఈ గౌతమ్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ,జిల్లా పశు సంవర్ధక అధికారి బాలరాజు, ఆర్డీఓ సుమా, డిఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా సంక్షేమ అధికారి, జిడబ్ల్యూ ఎంసీ ఎస్ ఈ సత్యనారాయణ, ఎంహెచ్ ఓ డాక్టర్ రాజేష్, ఇరిగేషన్, రెవెన్యూ, విద్యాశాఖ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.