సమ్మక్క సారలమ్మ మేడారం జాతర పోస్టర్లు CM రేవంత్ ఆవిష్కరణ: మంత్రులు పాల్గొన్నారు
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ మేడారం మహా జాతర-2026 కోసం రూపొందించిన అధికారిక బ్రోచర్, పోస్టర్లను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ గిరిజన సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఈ జాతర ప్రచార సామగ్రి ముఖ్యమైనదని నాయకులు తెలిపారు.