Homeవరంగల్ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని..

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని..

వరంగల్ జిల్లా: పాలకుర్తి నియోజకవర్గం, రాయపర్తి మండల కేంద్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) నిధుల కింద రూ. 20 లక్షల వ్యయంతో మంజూరైన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ పల్లె దవాఖానల ద్వారా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే చికిత్స పొందే అవకాశం కలుగుతుందని, ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాయపర్తి మండల అభివృద్ధికి అవసరమైన అన్ని రంగాల్లో తాము కట్టుబడి పనిచేస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్థానిక సర్పంచులు, వివిధ గ్రామ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments