మేడారం (ములుగు జిల్లా): మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో మేడారం పరిసర ప్రాంతాలు భక్తజన సంద్రమయ్యాయి. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో, జాతర రద్దీని తప్పించుకునేందుకు వేలాది మంది భక్తులు ఇప్పుడే మేడారానికి తరలివస్తున్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రుల బృందం మేడారంలో పర్యటించనుంది. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, సుమారు ₹300 కోట్లతో చేపట్టిన ఆలయ పునర్నిర్మాణం మరియు ‘మాస్టర్ ప్లాన్’ పనుల పురోగతిని వారు స్వయంగా పరిశీలించనున్నారు. భక్తుల సౌకర్యార్థం పస్రా-మేడారం రహదారిపై ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా 1,050 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం.