చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. నయనతార కథానాయిక. వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 11న స్పెషల్ ప్రీమియర్‌తో పాటు, టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.500గా నిర్ణయించింది. పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 టికెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించింది.