ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) పరిధిలో పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.
గత నెలలో నిర్వహించిన BSc థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి, సుమారు 35 మంది ఇన్-సర్వీస్ అభ్యర్థులకు ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు నిర్ధారణ అయింది. జగిత్యాల అగ్రికల్చర్ కాలేజీని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (VC) జానయ్య సందర్శించిన సమయంలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యులుగా గుర్తించిన నలుగురు అధికారులను తక్షణమే సస్పెండ్ చేశారు. అలాగే అక్రమాలకు పాల్పడిన అభ్యర్థుల అడ్మిషన్లను కూడా రద్దు చేశారు. ఈ మొత్తం ఘటనపై సమగ్ర విచారణ జరిపి, అసలు సూత్రధారులను పట్టుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.