Homeహన్మకొండఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షాలో పాల్గొన్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య

ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షాలో పాల్గొన్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య

హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు పాల్గొన్నారు.

ఈ సమావేశం లో ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు, 2బీహెచ్ కె గృహాలు, భూ భారతి, యూరియా, ధాన్య సేకరణ, ఎయిర్ పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, భద్రకాళి మాడవీధులు, సూపర్ స్పెషాలిటి హాస్పిటల్, వరద నివారణ పనులు తదితర అంశాలపై సమీక్షి నిర్వహించారు.

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, కాజీపేట రైల్వే బస్టాండ్ నిర్మాణానికి కేటాయించిన ప్రత్యామ్నాయ స్థల సమస్యపై రెవెన్యూ సెక్రెటరీతో త్వరలో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

భూపాలపల్లి జిల్లాలో మెడికల్ కళాశాల హాస్టల్ నిర్మాణానికి సంబంధించి మార్చి 26 నాటికి స్థల సేకరణ పూర్తి చేసి వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

అలాగే ఈఎస్‌ఐ హాస్పిటల్ పనులపై త్వరలో సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు చేపడతానని ఎంపీ పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని ఎంపీ సూచించారు.

ఈ సమీక్ష సమావేశం లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ముఖ్య మంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కే ఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మురళీ నాయక్, గండ్ర సత్యనారాయణ, పల్లా రాజేశ్వర్ రెడ్డి కుడా చైర్మెన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, రాష్ట్ర హౌసింగ్ పిడి విపి.గౌతం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి లోని కలెక్టర్లు స్నేహ శబరిష్, డాక్టర్ సత్య శారద, రాహుల్, షేక్ రిజ్వాన్ బాషా, అద్వైత్ కుమార్, బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments