Homeజాతీయంతిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగించుకోవచ్చని మద్రాస్ హైకోర్టు తీర్పు

తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగించుకోవచ్చని మద్రాస్ హైకోర్టు తీర్పు

మదురైలోని ప్రసిద్ధ తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే అంశంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ విషయంలో గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ, డివిజన్ బెంచ్ తుది తీర్పు వెలువరించింది.

దీపం వెలిగించడం వల్ల శాంతిభద్రతలకు భంగం కలగవచ్చనే ప్రభుత్వ వాదనను ధర్మాసనం తిరస్కరించింది. ప్రభుత్వమే అల్లర్లకు కారణమవితే తప్ప, భక్తులు దీపం వెలిగించడం వల్ల ప్రజా శాంతి భంగమవుతుందనే వాదన నమ్మదగదు అని కోర్టు స్పష్టం చేసింది.

తిరుపరంకుండ్రం కొండపై అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, సిక్కందర్ బాదుషా దర్గా ఉన్నాయి. కొండపై ఉన్న ఒక రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించాలని భక్తులు సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆ ప్రదేశం దర్గా పరిధిలోనిదని, దీపం వెలిగిస్తే మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతాయని ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి భక్తుల పక్షాన తీర్పు ఇవ్వగా, ఆ తీర్పుపై ప్రభుత్వమే అప్పీల్ దాఖలు చేసింది.

ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి ఆదేశాలను సమర్థించింది. దర్గా ప్రాంతమన్న వాదనలను “నిరాధారమైనవి మరియు దురుద్దేశపూరితమైనవి”గా అభివర్ణించింది. ఎత్తైన ప్రదేశంలో దీపం వెలిగించడం హిందూ సంప్రదాయం అని, భక్తుల కోరిక మేరకు ఆలయ యాజమాన్యం ఆచరించడంలో ఎటువంటి అడ్డంకి లేదని కోర్టు తెలిపింది. అలాగే, ప్రభుత్వం ఇలాంటి సున్నితమైన మతపరమైన విషయాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించింది.

ఈ తీర్పుతో తిరుపరంకుండ్రం మురుగన్ భక్తులలో ఆనందం వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదానికి ముగింపు లభించడం, తమ ఆచారం ప్రకారం కొండపై దీపం వెలిగించే అవకాశం రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments