Homeతెలంగాణజనసేన నాయకులు స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపు

జనసేన నాయకులు స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపు

హైదరాబాద్: జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పది జిల్లాల నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడిన శంకర్ గౌడ్… రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బరిలో దిగేందుకు అందరూ సన్నద్ధులు కావాలని డైరెక్షన్ ఇచ్చారు. ప్రజల సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వం అందించాల్సిన సంక్షేమ పథకాల కోసం ప్రజల పక్షాన నిలిచి, అందర్నీ ఐక్యం చేస్తూ పార్టీని గ్రామ-గ్రామానికి, ప్రతి ఇంటికీ చేర్చాలని నాయకులకు పిలుపునిచ్చారు. అందరూ ఏకమై పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో కూకట్‌పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, ఖమ్మం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రామకృష్ణ, వీరమహిళల విభాగం రాష్ట్ర చైర్‌పర్సన్ మండపాక కావ్యతో పాటు పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments