జిల్లాలోని గీసుగొండ మండలంలో వీధి కుక్కల కారణంగా జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఒకే మండలానికి చెందిన ఇద్దరు యువకులు ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఎలుకుర్తి హవేలీకి చెందిన ఆడెపు శివ అనే యువకుడు ఇటీవల మచ్చాపూర్ వద్ద బైక్పై వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్క అడ్డు రావడంతో ప్రమాదానికి గురై మృతి చెందారు. ఈ విషాదం మరవకముందే, నిన్న గంగదేవిపల్లికి చెందిన గూడ సంతోష్ కుమార్ ధర్మారం వద్ద కుక్క కారణంగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు విడిచారు.
ఒకే మండలంలో స్వల్ప కాలంలోనే ఇద్దరు యువకులు కుక్కల వల్ల ప్రాణాలు కోల్పోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను అరికట్టాలని కోరుతున్నారు.