Homeఎడ్యుకేషన్వరంగల్ రుచులు: తప్పక ట్రై చేయాల్సిన టిఫిన్స్ & స్నాక్స్

వరంగల్ రుచులు: తప్పక ట్రై చేయాల్సిన టిఫిన్స్ & స్నాక్స్

వరంగల్ – హన్మకొండ – కాజీపేట లో ప్రతి ఏరియాకి తన సొంత రుచులు ఉన్నాయి. లోకల్ వాళ్లు రికమెండ్ చేసే బెస్ట్ స్పాట్స్ లిస్టు ఇక్కడ చూద్దాం.

టిఫిన్ టైం ఫేవరెట్స్

పూరి – హన్మకొండ చౌరస్తా పూల మార్కెట్ దగ్గర పూరీలు, కర్రీతో బాగా ఫేమస్.

ఇడ్లీ – అలంకార్ వద్ద యూసఫ్ బండి, అలాగే సీతమ్మ హోటల్ (ఖిలా పంపు వద్ద)లో మృదువైన ఇడ్లీలు, చట్నీ, సాంబార్ ‌తో దొరుకుతాయి.

దోసా – యూనివర్సిటీ క్రాస్‌రోడ్స్ వద్ద, రిలయన్స్ ఎదుట ఉన్న దోసెలు స్టూడెంట్ క్రౌడ్‌కి ఫేవరెట్.

మైసూర్ బోండా & వడా – చార్ బౌలి, చింతల్‌లోని తమిళ్ హోటల్‌లో వేడి వేడి బోండాలు, వడలు.

పేసరట్టు – వరంగల్‌లో సత్య ఆసుపత్రి సమీపంలో ఉండే బండ్ల దగ్గర పేసరట్టు, ఉప్మా కాంబో స్పెషల్‌గా దొరుకుతుంది.

పొంగల్ – హోటల్ అశోక్‌లో నెయ్యి వాసనతో పొంగల్ టిఫిన్ అల్ టైమ్ హాట్ ఫేవరెట్.

దేవాలయ ప్రసాదాలు & సాంప్రదాయ వంటకాలు

పులిహోర & లడ్డూ – భద్రకాళి అమ్మవారి ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాదం‌గా ప్రసిద్ధి.

పొంగల్, దద్దోజనమ్ & కదంబం – ఎక్సైజ్ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాంప్రదాయ నైవేద్యంగా దొరికే రుచులు.

సర్వపిండి – పాపయ్యపేట చమన్ ప్రాంతం, అలాగే బట్టల బజార్‌లో విలేజ్ స్టైల్ సర్వపిండి.

వరంగల్ లో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

స్ట్రీట్ ఫుడ్ & వేడి వేడి స్నాక్స్

పాని పూరి – రామ్‌నగర్ జాండా వద్ద స్పైసీ పాని పూరి.

పావ్ భాజీ – వరంగల్ SBI దగ్గర సావరియా వద్ద బటర్ పావ్ భాజీ.

అలూ రాగడ & మసాలా చీజ్ పావ్ భాజీ – మిఠాయివాలా వద్ద చీజ్ పావ్ భాజీ, రాగడతో సూపర్ కాంబో.

మిర్చి & మంచూరియా – ఎక్సైజ్ కాలనీలో సీను మిర్చి వద్ద 22ఏళ్లుగా సాగుతున్న మిర్చి బజ్జీలు, మంచూరియన్ వంటి స్నాక్స్‌కు మంచి క్రేజ్ ఉంది.

భెల్‌పురి – పబ్లిక్ గార్డెన్ వద్ద చట్‌పట్‌గా దొరికే భెల్‌పురి.

సమోసా & జలేబీ – వీణా బజార్‌లో ఈవెనింగ్ టైమ్‌కి పర్ఫెక్ట్ కాంబినేషన్.

కట్లెట్ – అశోక హోటల్ ఎదుట ఉన్న బండ్ల దగ్గర క్రిస్పీ కట్లెట్స్.

సర్వపిండి – పాపయ్యపేట చమన్ & బట్టల బజార్ ప్రాంతాల్లో దొరికే హోమ్ స్టైల్ సర్వపిండి.

స్వీట్‌లు, బేకరీ ఐటమ్స్ & కూల్ డ్రింక్స్

దిల్ పసంద్ – అశోక్ బెంగళూరు బేకరీలో దిల్ పసంద్, పేస్ట్రీలు బాగా పాపులర్.

లస్సీ – కాశీబుగ్గలోని అఫ్జల్ వద్ద మందమైన లస్సీ, రోస్ లస్సీ లాంటివి లొకల్ ఫేవరెట్స్.

ఫలూదా – రాధిక థియేటర్ దగ్గర శివశంకర్ వద్ద ఫలూదా, ఐస్‌క్రీమ్ కాంబోలు.

సోడా – రైల్వే గేట్ కింద లెమన్, జీడిపప్పు, కలర్ సోడాలు వేసవిలో చల్లగా ఉంటాయి.

కాఫీ, టీ & లైట్ బైట్స్

కాఫీ – ఎన్‌ఐటి వరంగల్ క్యాంపస్‌లోని Nescafé పాయింట్ స్టూడెంట్స్‌కి ఫేమస్ హ్యాంగౌట్ స్పాట్‌గా ఉంది.

టీ – సుప్రభా హోటల్ వెనుక వైపు తయారు చేసే టీ, మసాలా టీతో ఉదయం, సాయంత్రం క్రౌడ్ గ్యారంటీ. ( ప్రస్తుతం వేరే ప్రాంతం లోకి మార్చారు )

పఫ్స్ – సురభి వద్ద విభిన్న రకాల వెజ్, ఎగ్ పఫ్స్.

పనీర్ శాండ్‌విచ్ – ఏసియా మాల్‌లోని ఫుడ్ కౌంటర్ల వద్ద పనీర్ శాండ్‌విచ్, బర్గర్లు, క్విక్ బైట్స్.

“మిస్ అయిన మీ ఫేవరెట్ ప్లేస్ ఏది? కామెంట్స్‌లో చెపండి”

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments