Homeహన్మకొండవరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం | ఎమ్మెల్యే కడియం శ్రీహరి

వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం | ఎమ్మెల్యే కడియం శ్రీహరి

వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, శాశ్వత స్పోర్ట్స్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

వరంగల్ జిల్లాలో త్వరితగతిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మరియు శాశ్వత క్రీడా పాఠశాల నిర్మాణానికి స్థలాన్ని గుర్తించి పనులు ప్రారంభించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ప్రభుత్వాన్ని కోరారు.

అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ……

వరంగల్ జిల్లా విద్యా కేంద్రంగానే కాకుండా క్రీడా కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలందరం కోరగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం, రెసిడెన్షియల్ క్రీడా పాఠశాల ఏర్పాటుకు మా విజ్ఞప్తితో ఏకీభవించి హామీ ఇచ్చారని తెలిపారు. సీఎం గారు హామీ ఇచ్చి ఇప్పటికే ఆరు నెలలు గడిచాయని కావున వరంగల్‌లో శాశ్వత స్పోర్ట్స్ నిర్మాణంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులను తక్షణమే వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ మంత్రి, జిల్లా మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రులను కోరారు.

యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలంటే ఆధునిక స్పోర్ట్స్ సౌకర్యాలు అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.

అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుతో వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని, దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా ప్రాంతీయ, ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని ఆయన అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments