హన్మకొండ పబ్లిక్ గార్డెన్, బాలసముద్రం చిల్డ్రన్స్ పార్క్, జయశంకర్ ఏకశిలా పార్క్‌లను పరిశీలించిన వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ గారు. శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ పుష్పించే మొక్కలను నాటి పార్కుల అందాన్ని మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు.
అలాగే పార్కుల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి, సిబ్బంది సమయపాలనను కఠినంగా అమలు చేయాలని సూచించారు.

రాలిపోయిన లేదా ఎండిపోయిన ఆకులను వ్యర్థాలుగా కాకుండా బయోమాన్యూర్గా వినియోగించేందుకు, వాటిని బాలసముద్రంలోని బయోగ్యాస్ ప్లాంట్‌కు తరలించే చర్యలు తీసుకోవాలని సూచించారు.