చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన హృతిక్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య శుక్రవారం పరామర్శించారు.
ఇటీవల జరిగిన దుర్ఘటనలో హృతిక్ రెడ్డి మృతి పట్ల ఎంపీ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి తాను అండగా ఉంటానని ఎంపీ భరోసా ఇచ్చారు.
అనంతరం ఎంపీ డా.కడియం కావ్య మీడియాతో మాట్లాడుతూ… హృతిక్ రెడ్డి గారి మరణం చాలా బాధాకరం అన్నారు.
విషయం తెలిసిన వెంటనే 31వ తేది నుండి జర్మనీలోని భారత రాయబార కార్యాలయం, జర్మనీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్కు తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.