వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) ప్రధాన ద్వారం వద్ద ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు. తమ ఉద్యోగ భద్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ వారు ఈ ఆందోళనకు దిగారు.
కాంట్రాక్టర్లు మారిన ప్రతిసారీ పాత ఉద్యోగులను తొలగించడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్లుగా ఈ కళాశాలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు అకస్మాత్తుగా తమను రోడ్డున పడేయడం సరికాదని వారు నినదించారు.
నిట్ అధికారులు వెంటనే స్పందించి తమ ఉద్యోగ భద్రతపై స్పష్టమైన హామీ ఇవ్వాలని, విధుల్లో కొనసాగేలా చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు.