మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం మొక్కుల సీజన్ కావడంతో, వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో మేడారానికి చేరుకుంటున్నారు.
శుక్రవారం మొక్కుల రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ పెరిగింది. దట్టమైన పొగమంచు కురుస్తున్నప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు.
ఈ రోజు ఉదయం ఆదివాసీ కోయ పూజారులు డోలు వాయిద్యాల నడుమ వనదేవతలకు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.