వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులతో కలసి కేక్ కట్ చేశారు.
అనంతరం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు సిబ్బందితో పాటు ప్రభుత్వ అధికారులు, పాఠశాల విద్యార్థులు, మీడియా ప్రతినిధులు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చలు, మొక్కలను అందజేశారు.
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని, లక్ష్యాలను పూర్తి చేయాలని, అలాగే పోలీస్ అధికారులు, సిబ్బంది సుఖసంతోషాలతో వుండాలని, ముఖ్యం తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీపీలు రాజమహేంద్ర నాయక్, దార కవిత ఏ. ఎస్పీ శుభం, ట్రైనీ ఐపిఎస్ మనీషా నెహ్ర, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్, బాలస్వామి, సురేష్ కుమార్, శ్రీనివాస్ తో పాటు ఏసీపీలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్. ఎస్ లు, ఎస్. ఐ లు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.