వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య.
కొత్త ఏడాది… కొత్త ఆశలు…. కొత్త కోరికలు…. కొత్త లక్ష్యాలు…. కొత్త ఆశయాలు…. కొత్త నిర్ణయాలు…. కొత్త ఉత్సాహంతో కలకాలం ఉండాలని కోరుకుంటూ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలందరికీ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ నూతన సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, శాంతి, సుభిక్షతను అందించాలని ఎంపీ ఆకాంక్షించారు.
గత ఏడాది ప్రజల సహకారం, ఆశీర్వాదాలతో నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేయగలిగామని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో రైతులు, మహిళలు, యువత, కార్మికులు సహా అన్ని వర్గాల సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తానని తెలిపారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేస్తానని చెప్పారు.
ఈ నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో సంతోషాలు, శుభఫలితాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.