అగ్రంపహాడ్ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు
బుధవారం ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం నందు జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గారితో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… జాతర విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జాతరలో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరుగకుండా శాంతి భద్రతల పర్యవేక్షణ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.
భక్తుల సౌకర్యార్థం త్రాగు నీరు ఏర్పాటు చేయడం దేవాలయ జాతర ప్రాంగణము, వాహనాలు పార్కింగ్ స్థలములలో లైటింగ్ ఏర్పాటు మరియు అమ్మవార్ల గద్దెల చుట్టూ లైటింగ్ డెకరేషన్ ఏర్పాటు చేయటం
నిరంతర విధ్యుత్ సరఫరా ఏర్పాటు తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు, 108 వాహనం అదుబాటులో ఉంచుట, 27*7 వైద్యులు అందుబాటులో ఉండాలని, శానిటేషన్, జాతరకు వచ్చే అన్ని లింకు రోడ్ల మరమ్మతు, తదితర అంశాలపై చర్చించారు.