వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఉన్న సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత గారు మడికొండ పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీలలో భాగంగా సందర్శించడం జరిగింది.
ఈ సందర్బంగా స్థానిక మడికొండ పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీ P. కిషన్ గారు మరియు ACP కాజిపేట్ శ్రీ P. ప్రశాంత్ రెడ్డి గారు డీసీపీ గారికి గౌరవ సూచకంగా పూల మొక్కను అందించి లోపలికి ఆహ్వానించిన పిదప స్థానిక పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించడం జరిగింది.
అనంతరం స్థానికపోలీస్ సిబ్బంది తో మాట్లాడి వారి కిట్ ఆర్టికల్స్ ను తనిఖీ చేసిన తర్వాత స్టేషన్ పరిసరాలను గుర్తించి మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ గారి మరియు కాజిపేట్ ACP గారి ఆధ్వర్యంలో మామిడి చెట్టును నాటడం జరిగింది.
అనంతరం స్టేషన్లో ఉన్న అన్ని గదులను పరిసరాలను శుభ్రంగా ఉన్నాయా లేదా అని ప్రత్యక్షంగా చూసిన తర్వాత స్టేషన్ కి సంబంధించిన గత మూడు సంవత్సరాల నేరాలకు సంబంధించి న వివరాలు తీసుకుని వాటిని తగ్గించడం కోసం తీసుకున్న చర్యలు తెలుసుకున్నారు.
ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, నివారణ కోసం తీసుకున్న చర్యలు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మీటింగ్ అనంతరం మడికొండ పోలీస్ సిబ్బంది అందరితో మాట్లాడి సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఏవైనా సమస్యలు ఉంటే ఉన్నతధికారుల దృష్టికి తీసుకుని రావాలని సమాజంలో పోలీస్ యొక్క ఇమేజ్ పెరగడం లో గ్రౌండ్ లెవెల్ లో పనిచేసే సిబ్బంది పాత్ర ముఖ్యమైనదని అన్నారు.
నిత్యం శాంతి భద్రతలను కాపాడుకుంటు ప్రజలకు అందుబాటులో ఉండాలని చిన్న సమస్య అయినా దానికి వెంటనే ప్రతిస్పందించి సమస్యలను పరిష్కరించాలని నేర నియంత్రణ చేయాలనీ రౌడీ షీటర్స్ మరియు సస్పెక్ట్ షీట్స్ ఉన్న వ్యక్తుల మీద నిరంతరం నిఘా ఉంచాలని వారి జీవన విధానం ఎలా ఉంది నేరాలకు మళ్ళీ పాల్పడుతున్నారా లేదా అని గుర్తించాలని మహిళలు, పిల్లలు, వృద్ధులు స్టేషన్ కు వచ్చినప్పుడు వారి సమస్యలకు అత్యంత ముఖ్యమైనవని గుర్తించి పరిష్కరించాలని సూచించారు.
అంతే కాకుండా సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల కుటుంబ విషయాలలో శ్రద్ద పెట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాజిపేట్ ACP శ్రీ P. ప్రశాంత్ రెడ్డి గారు, ఇన్స్పెక్టర్ శ్రీ P. కిషన్ గారు SI లు రాజబాబు, రాజ్ కుమార్, రామ్ మోహన్ మరియు మడికొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.