నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ (CP) సున్‌ప్రీత్ సింగ్ వాహనదారులకు కీలక సూచనలు చేశారు. వేడుకల సమయంలో మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.
మద్యం సేవించి వాహనం నడిపితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సీపీ స్పష్టం చేశారు.
మద్యం సేవించిన వారు సొంతంగా వాహనాలు నడపకుండా, క్యాబ్‌లలో వెళ్లాలని లేదా మద్యం సేవించని వ్యక్తిని తోడు తీసుకెళ్లాలని సూచించారు.
వీలు పడకపోతే వేడుకలు జరుపుకున్న చోటే నిద్రించి, మరుసటి రోజు ఉదయం ఇళ్లకు వెళ్లాలని కోరారు.
ప్రజల క్షేమమే పోలీసుల ప్రాధాన్యత అని, ఎవరూ నిబంధనలు అతిక్రమించి ప్రమాదాల బారిన పడవద్దని ఆయన పేర్కొన్నారు.