Homeహన్మకొండగోపాలపూర్ చెరువు రూపురేఖలు మారిపోనున్నాయి

గోపాలపూర్ చెరువు రూపురేఖలు మారిపోనున్నాయి

చెరువు అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రకటించారు.

చెరువుపై ఆధారపడి ఉన్న రైతులు, చేపల కూలీల సమస్యలు తగ్గేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

భారీగా పడ్డ వర్షాల కారణంగా చెరువు కట్టలు దెబ్బతిన్నందున, త్వరలోనే మరమ్మత్తు పనులు ప్రారంభమవుతాయని ఆయన వివరించారు.

మొదటి దశలో ఒకే సారి సుమారు 15 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.

గోపాలపూర్ చెరువును ఆధునిక శైలిలో తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖలతో కలిసి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments