తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కార్యవర్గ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఈ ఎన్నికల్లో రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పోటీ చేయగా, మొత్తం 48 మంది సభ్యులలో 31 మంది ఈ ప్యానెల్ తరపున విజయంసాధించారు.
ఫిలిం ఛాంబర్ కీలక పదవులలో:
• కార్యదర్శిగా అశోక్ కుమార్
• వైస్ ప్రెసిడెంట్గా నాగవంశీ
• కోశాధికారిగా ముత్యాల రామదాసు ఎంపికయ్యారు.
ఈ విజయంతో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తన బలాన్ని మరోసారి నిరూపించుకుంది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడు సురేష్ బాబు! ప్రోగ్రెసివ్ ప్యానెల్ భారీ విజయం. అశోక్ కుమార్ కార్యదర్శి, నాగవంశీ వైస్ ప్రెసిడెంట్. TFCC ఎన్నికల 2025 ఫలితాలు, వివరాలు greaterwarangal.comలో.