హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫ్యాకల్టీ అంతర్జాతీయ స్థాయిలో మరొకసారి ప్రతిష్టను చాటుకుంది.
ఫార్మసీ విభాగాన్ని భారతదేశంలోనే అగ్రశ్రేణి కాలేజీలలో ఒకటిగా గుర్తించడం తో పాటు, పరిశోధన రంగంలో ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించింది.
గ్లోబల్ రికగ్నిషన్‌కు కారణాలు
గత ఐదు దశాబ్దాల్లో యూనివర్సిటీ ఫార్మసీ విభాగం నుంచి వేలాది మంది బఫార్మసీ, ఎంఫార్మసీ, పీహెచ్‌డీ పట్టభద్రులు వెలువడి, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఔషధ పరిశ్రమ నిపుణులు, రెగ్యులేటరీ అధికారులుగా వెలుగొందుతున్నారు.
అమెరికా FDA మాజీ డైరెక్టర్ డాక్టర్ మన్సూర్ ఖాన్, దివిస్ ల్యాబొరేటరీస్ స్థాపకుడు డాక్టర్ డి.వి. మురళికృష్ణ, టెక్సాస్ A&M యూనివర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్ సాంబా రెడ్డి వంటి మాజీ విద్యార్థులు KU ఫార్మసీకి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చారు.
ఫార్మా ఫ్యాకల్టీ కీలక పాత్ర
ప్రొఫెసర్‌లు సి.కె.కొకటే, మల్లారెడ్డి, అమరేశ్వర్, రాంబాహు, డి.రామకృష్ణ, ఎం.సి.ప్రభాకర్ వంటి ప్రముఖులు ఫార్మసీ విద్య, పరిశోధనలో నూతన ప్రమాణాలు నెలకొల్పి KU ఫార్మసీకి గ్లోబల్ రికగ్నిషన్ తెచ్చినవారిగా గుర్తింపు పొందారు.
విభాగంలో గత 12 ఏళ్లలో 60కి పైగా పీహెచ్‌డీలు పూర్తవడం, అనేక పేటెంట్లు, నేషనల్–ఇంటర్నేషనల్ జర్నల్స్‌లో శాస్త్రీయ పత్రాలు ప్రచురించడంలో ఫ్యాకల్టీ కీలక పాత్ర పోషించింది.
విద్యార్థుల నైపుణ్యాలు
బీఫార్మసీ విద్యార్థులు NIPER వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి, దేశంలోని ప్రముఖ ఫార్మసీ సంస్థల్లో అడ్మిషన్లు పొందుతున్నారు.
KU ఫార్మసీ విద్యార్థులు దేశీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్సుల్లో పేపర్ ప్రెజెంటేషన్లు, ఉత్తమ పోస్టర్ అవార్డులు సాధిస్తూ విభాగ ప్రతిష్ఠను మరింత పెంచుతున్నారు.
వీవీద ప్రసంశలు, భవిష్యత్ ప్రణాళికలు
కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి, ఫార్మసీ విభాగం గత యాభై ఏళ్ల ప్రయాణాన్ని స్మరించుకుంటూ, ఫ్యాకల్టీ, అల్యూమ్నీ తీసుకువచ్చిన అంతర్జాతీయ గుర్తింపు పట్ల ప్రశంసలు కురిపించారు.
అల్యూమ్నీ సపోర్టుతో ‘గోల్డెన్ జూబిలీ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’
ఇండియా–USA జాయింట్ రీసెర్చ్ గ్రాంట్
స్టూడెంట్–ఫ్యాకల్టీ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
వరంగల్ కు గర్వంగా KU ఫార్మసీ
• తెలంగాణలో ఫార్మసీ రంగానికి KU ఫార్మసీ ఒక బలమైన దిగ్బంధంగా నిలిచి, రాష్ట్రాన్ని ఓ ప్రముఖ IT–Pharma హబ్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
• హన్మకొండ–వరంగల్ ప్రజలకు KU ఫార్మసీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం గర్వకారణంగా మారి, ఇక్కడి విద్యార్థులకు గ్లోబల్ కెరీర్ అవకాశాలకు దారులు తెరిచింది.