Homeహన్మకొండహన్మకొండ | వరంగల్ లో CBG ప్లాంట్‌కు ఎంపీ కవ్య లేఖ

హన్మకొండ | వరంగల్ లో CBG ప్లాంట్‌కు ఎంపీ కవ్య లేఖ

హనుమకొండ: వరంగల్‌లో CBG ప్లాంట్‌ను వెంటనే ఏర్పాటు చేయాలంటూ ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు లేఖ రాసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

వరంగల్ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్‌కు వెంటనే అనుమతులు ఇవ్వాలి.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజుకు 400 టన్నుల మున్సిపల్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంది.

CBG ప్లాంట్ ఏర్పాటు కోసం అవసరమైన స్థలాన్ని కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

CBG ప్లాంట్ ఏర్పాటుతో పర్యావరణ పరిరక్షణ తో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ౼ వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

వరంగల్ నగరంలో సుస్థిర సేంద్రీయ వ్యర్థాల నిర్వహణ కోసం కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆయిల్ ఇండియా లిమిటెడ్ (నోయిడా) చైర్మన్‌కు లేఖ రాశారు.

విద్యా , వాణిజ్య కార్యకలాపాల విస్తరణతో వరంగల్ నగర జనాభా వేగంగా పెరుగుతోందని, దీని ఫలితంగా గృహాలు, హోటళ్లు, హాస్టళ్లు, విద్యాసంస్థలు, దేవాలయాలు, వాణిజ్య సంస్థల నుంచి భారీగా సేంద్రీయ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లేక ద్వారా వివరించారు.

ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజుకు సుమారు 400 టన్నుల మున్సిపల్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా, క్లస్టరింగ్ ద్వారా ఈ పరిమాణం 650 టన్నుల వరకు చేరే అవకాశముందని తెలిపారు.

ఈ వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించేందుకు వరంగల్‌లో CBG ప్లాంట్ ఏర్పాటు అత్యంత అవసరమని పేర్కొన్నారు.

వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలో CBG ప్లాంట్ ఏర్పాటు కోసం అవసరమైన స్థలాన్ని కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని, ముందుగా సాధ్యత (ఫీజిబిలిటీ) అధ్యయనం నిర్వహించి అనంతరం ప్లాంట్ మంజూరు చేయాలని ఆయిల్ ఇండియా లిమిటెడ్‌ను వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కోరారు.

ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 25 కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్లలో ఒక యూనిట్‌ను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా ఏర్పాటు చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు.

ఈ మేరకు ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు లేఖ రాసిన ఆమె, ఇప్పటికే అస్సాం, ఒడిశా రాష్ట్రాలలో ఇలాంటి CBG యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారని గుర్తు చేశారు.

అదే తరహాలో వరంగల్ నగరంలోని మున్సిపల్ వ్యర్థాలను వినియోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేసేలా CBG ప్లాంట్‌ను ఆయిల్ ఇండియా ఏర్పాటు చేయాలని ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు.

వరంగల్ పరిసర ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్లు, హోటళ్లు, హాస్టళ్లు, స్లాటర్ హౌసులు, గృహాల నుంచి వచ్చే వేరు చేసిన సేంద్రీయ వ్యర్థాలు CBG ప్లాంట్‌కు అవసరమైన ముడి పదార్థంగా సమృద్ధిగా లభ్యమవుతాయని తెలిపారు.

దీనివల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఎంపీ డా. కడియం కావ్య పేర్కొన్నారు.

వరంగల్ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని CBG ప్లాంట్‌కు వెంటనే అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments