Homeవరంగల్ఆర్ధిక సంక్షోభంలోను అమలవుతున్న సంక్షేమ పథకాలు…

ఆర్ధిక సంక్షోభంలోను అమలవుతున్న సంక్షేమ పథకాలు…

పేదల పాలిట పెద్ద దిక్కుగా నిలిచిన సీఎం సహాయనిధి…

పార్టీలకు అతీతంగా చెక్కులను పంపిణీ చేస్తున్నాం..

62 మంది లబ్ధిదారులకు రూ.42 లక్షల చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని.

గతపాలకుల హయాంలో జరిగిన ఆర్ధిక సంక్షోభం వల్ల ప్రజలు ఇబ్బంది కలగకూడదని సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో జాప్యం చేయడం లేదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు అన్నారు.బుధవారం రోజున నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారితో కలిసి 11 వ మరియు 29 డివిజన్ వరంగల్ మండలానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు రూ.42,59,096/-ల కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను మరియు మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.

సహాయం అని కోరి క్యాంపు కార్యాలయం వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా సీఎం సహాయనిధి,ఇతరత్రా సహాయం అందిస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.గతంలో పర్సంటేజ్ లేకుంటే పనులు కాకపోయేవి కానీ పారదర్శకంగా ప్రజా ప్రభుత్వంలో పనులు జరుగుతున్నాయని తెలిపారు.

MLA Naini Rajender Reddy

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments