ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో ప్రధానంగా అస్తమా, న్యూమోనియా, మరియు గుండెపోటు వంటి కేసులు భారీగా నమోదవుతున్నాయి.
వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి ప్రతిరోజూ 50 ఏళ్లకు పైబడిన వృద్ధులు అస్తమా, న్యూమోనియా లక్షణాలతో వస్తుండగా, ప్రతిరోజు చిన్నపిల్లలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రస్తుతం రోగులతో పిల్లల వార్డు పూర్తిగా నిండిపోయి కిక్కిరిసి కనిపిస్తోంది.
చలి నుండి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు మరియు పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పెరుగుతున్న చలి.. MGM పిల్లల వార్డు కిక్కిరిత
RELATED ARTICLES