హనుమకొండ బాలసముద్రంలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ స్టేట్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.
ఈ దీక్షా శిబిరాన్ని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, మాజీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సందర్శించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
రిటైర్డ్ ఉద్యోగుల కళ్లలో కన్నీరు తుడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రావు పద్మ పేర్కొన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.