Homeహన్మకొండహనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు

హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు

హనుమకొండ జిల్లా సుబేదారిలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మంగళవారం క్రిస్మస్ వేడుకలను అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి గారు కేక్ కట్ చేసి అధికారికంగా ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచానికి ప్రేమ, శాంతి మరియు ఐక్యతను చాటిచెప్పాయని కొనియాడారు.

విద్యాసంస్థల్లో అన్ని మతాల పండుగలను సమానంగా జరుపుకోవడం వల్ల విద్యార్థులలో సోదరభావం పెరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వేడుకల్లో కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments