Homeవరంగల్ఈ రోజు ముఖ్యాంశాలు 21.12.2025

ఈ రోజు ముఖ్యాంశాలు 21.12.2025

గాదె ఇన్నయ్యని అరెస్ట్ చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ..మావోయిస్టు అగ్రనేత కాతా రామచంద్రా రెడ్డి అంత్యక్రియల సభలో నిషేధిత సంస్థకు అనుకూలంగా మాట్లాడాడు.

గాదె ఇన్నయ్య మావోయిస్టు కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ చట్టవిరుద్ద చర్యలకు ప్రేరేపించడంతో అరెస్ట్ చేసినట్టు సమాచారం.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ భూ-నిర్వాసితులకు నష్టపరిహారం మరియు ఉద్యోగాలు కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. అయోధ్య పురం గ్రామంలో రైల్వే జేఏసీ గ్రామ భూ నిర్వాసితుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

రేషన్ దారుల లబ్ది కోసం T – రేషన్ యాప్ ని అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం.

టెన్త్ పరీక్షల షెడ్యూల్ లో మార్పులు జరిగే అవకాశం.. పరీక్షల మధ్య గ్యాప్ ఉందని, తగ్గించాలంటూ డిమాండ్.

మేడారం జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.

గ్యారంటీలను గాలికోదిలేశారా అంటూ సోనియాకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ..

కాజీపేట మండలంలోని బాబు క్యాంపులో కుక్కల సర్వ విహారం.. చర్యలు తీసుకోవట్లేదని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.

ఓటు వేయలేదని తల్లితండ్రుల పై దాడి చేసిన హన్మకొండ భీమదేవరపల్లి మండలం వంగర సర్పంచ్ గా ఎన్నికైన రమేష్..వరంగల్ పోలీస్ స్టేషన్ లో కొడుకు పై ఫిర్యాదు చేసిన భాధితుడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments