Homeహన్మకొండసర్పంచులు ప్రజలకు ప్రథమ పౌరులు – ప్రజల కోసం కట్టుబడి పని చేయాలి

సర్పంచులు ప్రజలకు ప్రథమ పౌరులు – ప్రజల కోసం కట్టుబడి పని చేయాలి

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం:

కాంగ్రెస్ బలోపేతం చేసిన పంచాయితీ వ్యవస్థను కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది

గ్రామ స్వరాజ్యానికి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీనే

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర బీజేపీ బలహీనపరుస్తుంది

కేంద్రం 90 శాతం నిధులను కేవలం 60 శాతం మాత్రమే చేయడం సరికాదు

నూతన ప్రజాప్రతినిధులు గ్రామానికి ప్రథమ పౌరులు

సర్పంచులు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి

గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలి. ౼ వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమానికి స్థానికశాసన సభ్యులు కడియం శ్రీహరి గారితో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులకు శాలువాలు బొకేలు అందజేసి ఘనంగా సత్కరించిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ,…

కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసిన పంచాయితీ వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.

రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో చేసిన రాజ్యాంగ సవరణతో గ్రామ పంచాయితీలకు కేంద్రం నుంచి నేరుగా నిధులు వచ్చే విధానాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందని ఎంపీ గుర్తు చేశారు.

గ్రామ స్వరాజ్యానికి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీనేనని, కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తోందని అన్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఇప్పటివరకు కేంద్రం 90 శాతం నిధులు ఇస్తున్న పరిస్థితి నుంచి, కేవలం 60 శాతం మాత్రమే ఇవ్వాలనే ప్రతిపాదన ముందుకు తేవడం వెనుక గ్రామీణ వ్యవస్థను బలహీనపర్చే బీజేపీ ఆలోచన స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.

ఉపాధి హామీ పథకం గ్రామ పేదల జీవితాలకు భరోసా. అలాంటి పథకంలో కేంద్రం బాధ్యత తగ్గించుకోవడం గ్రామాలపై దాడి చేసినట్లే, అని ఎంపీ డా. కడియం కావ్య అన్నారు గ్రామాల్లో సర్పంచ్‌లుగా ఎన్నికైన కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించాలని, గ్రామాల హక్కుల కోసం గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గ్రామీణ వ్యవస్థకు అండగా నిలిచిందని, భవిష్యత్తులో కూడా గ్రామ స్వరాజ్యాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్‌దేనని ఎంపీ స్పష్టం చేశారు.

నూతన ప్రజాప్రతినిధుల గెలుపు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. తాను ఎంపీగా గెలిచినప్పుడు ఎంత సంతోషంగా ఉందో, మీరు గెలిచినప్పుడు కూడా అంతే సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఇంటిని చక్కదిద్దే మహిళలు గ్రామాన్ని కూడా చక్కగా అభివృద్ధి చేయగలరని అన్నారు.

మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని, తక్కువ కాకూడదని నిరూపించేలా పని చేయాలని మహిళా ప్రజాప్రతినిధులకు ఎంపీ పిలుపునిచ్చారు.

సర్పంచులు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు.

సర్పంచ్ ల గెలుపుకు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కాగా, మరోవైపు కడియం శ్రీహరి గారు కారణమని స్పష్టం చేశారు.

కడియం శ్రీహరి గారు ప్రజల కోసం కట్టుబడి పనిచేసినట్లే, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మీరు కూడా పని చేయాలని సూచించారు.

తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లక్ష 28 వేలకుపైగా ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. బీఆర్ఎస్‌కు సగం ఓట్లు మాత్రమే దక్కాయని, బీజేపీ పూర్తిగా గల్లంతైందని వ్యాఖ్యానించారు.

రానున్న 2029లో ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సర్పంచులు, వార్డు సభ్యులు ఎమ్మెల్యే గారికి – ప్రజలకు మధ్య వారధిగా పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు. అవసరమైతే తన దృష్టికి కూడా సమస్యలను తీసుకురావాలని సూచించారు.

కడియం శ్రీహరి గారిపై ఉన్న నమ్మకంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తున్నారని తెలిపారు.

తాను కూడా తన ఎంపీ నిధుల నుంచి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని అన్నారు.

రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహంతో కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలమైన పార్టీగా తీర్చిదిద్దాలని కోరారు.

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నానని చెప్పారు.

రానున్న రోజుల్లో మహిళలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మహిళా ప్రజాప్రతినిధులకు ఎంపీ డాక్టర్ కడియం కావ్య సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments