Homeవరంగల్వరంగల్‌ లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం

వరంగల్‌ లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం

వరంగల్: తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోందని వాతావరణ నిపుణులు తెలిపారు.

వరంగల్ సహా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయని అంచనా వేశారు.

రాత్రి, పొద్దున్న వేళల్లో కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 నుండి 8 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని సూచించారు.

వచ్చే వారం మొత్తం ఈ చలి ప్రభావం కొనసాగవచ్చని నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు.

ప్రజలు చలికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments