వరంగల్: తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థిని మహమ్మద్ అసియా ఇటీవల చెన్నైలో జరిగిన కరాటే పోటీలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న విషయం తెలియడంతో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, తన పర్యటనలో భాగంగా శుక్రవారం సదరు హన్మకొండ మైనారిటీ విద్యా సంస్థకు వెళ్ళి అసియాను అభినందించారు.
ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు పత్రాన్ని అసియా, మంత్రి సురేఖకు చూపించి వివరాలు తెలిపారు.
తమిళనాడులోని చెన్నై అక్టోబర్ 5వ తారీఖున జరిగిన కరాటే పోటీ ప్రదర్శనలో సుమారు మూడు వేల మంది కరాటే ఛాంపియన్లతో 17 మంది సమన్వయకర్తల మధ్య కేవలం 863 మంది మాత్రమే క్వాలిఫై అయినట్టు తెలిపారు.
అయితే, తెలంగాణకు సంబంధించిన అసియా మైనారిటీ గురుకుల విద్యా సంస్థలో చదువుతుండటం విశేశమని మంత్రి సురేఖ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరింత శిఖరాలకు వెళ్లాలని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమం లో 23వ డివిజన్ మాజి కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ పాల్గొన్నారు