Homeసినిమాఓజీ దర్శకుడికి పవన్‌ కల్యాణ్‌ నుంచి అదిరిపోయే గిఫ్ట్‌

ఓజీ దర్శకుడికి పవన్‌ కల్యాణ్‌ నుంచి అదిరిపోయే గిఫ్ట్‌

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తన తాజా మూవీ ‘ఓజీ’ (OG) విజయోత్సాహంలో దర్శకుడు సుజీత్‌‌కు ఓ విలాసవంతమైన బహుమతి అందించారు. పవన్‌ కల్యాణ్‌ స్వయంగా ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ కారును కానుకగా ఇచ్చారు. ఈ వార్త సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

సుజీత్‌ ఈ సంతోషాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. “బాల్యం నుంచే పవన్‌ కల్యాణ్‌ అభిమానిని. ఇప్పుడు ఆయన్నుంచి స్వయంగా గిఫ్ట్‌ అందుకోవడం కలలాంటిదే. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నా ఓజీ పవన్‌ కల్యాణ్‌ ప్రేమ, ప్రోత్సాహం నేను ఎప్పటికీ మరవలేను. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా” అంటూ హృదయపూర్వకంగా పేర్కొన్నారు.

X

పవన్‌ కల్యాణ్‌ చేసిన ఈ గిఫ్ట్‌ సుజీత్‌పై ఆయన చూపుతున్న అభిమానానికి నిదర్శనంగా పలువురు నెటిజన్స్‌ ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు. మరోవైపు, ‘ఓజీ’ సినిమా శాందర్భిక విజయంతో ఇద్దరికీ కూడా అభిమానుల నుంచి శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments