కరీమాబాద్ ప్రాంతంలో గల న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హై స్కూల్ విద్యార్థులు అబాకస్ జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని ప్రతిభ చూపడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు కరస్పాండెంట్ కోడం శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులను అభినందించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోడం సబిత మాట్లాడుతూ కాజీపేటలో విశ్వం ఎడ్యుటెక్ వారు నిర్వహించిన అబాకస్ స్కిల్ కరికులం పోటీలలో పాఠశాల నుంచి పాల్గొన్న విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపించడంతోపాటు నాలుగవ తరగతి కి చెందిన జి రుత్విక్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం, మరియు ఐదవ తరగతికి చెందిన బి సిరి స్టార్ ఛాంపియన్ గెలుచుకోవడం జరిగిందని అన్నారు.
కోడం శ్రీధర్ మాట్లాడుతూ డిసెంబర్ నెల చివరి వారంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని జాతీయస్థాయికి పాఠశాల విద్యార్థులు తప్పక ఎంపిక అవుతారని ఆశించారు.
కార్యక్రమంలో అబాకస్ ఉపాధ్యాయినిలు కే.లక్ష్మీ ప్రసన్న, ఎం. దివ్య, ఏ. కవిత ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.