న్యూఢిల్లీ – పార్లమెంట్: యోగ, ఆయుష్ సేవల విస్తరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై లోక్‌సభలో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
దేశంలో యోగా ప్రచారం, హర్బల్ ఔషధాల నాణ్యత, గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్ సేవల విస్తరణ వంటి కీలక అంశాలపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు.
ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలియజేయాలన్నారు.
ప్రధానంగా యోగా ప్రచార కార్యక్రమాల వివరాలు
గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్వహించిన జాతీయ, ప్రాంతీయ యోగా క్యాంపైన్ల వివరాలు, వాటిలో పాల్గొన్న వారి సంఖ్య, కేటాయించిన బడ్జెట్‌ను వెల్లడించాలన్నారు.
హర్బల్ మందుల నాణ్యత
దేశంలో హర్బల్ ఔషధాల నాణ్యత ప్రమాణాలు పాటించేలా ప్రభుత్వం ఎలాంటి పర్యవేక్షణ వ్యవస్థ అమలు చేస్తోంది? లైసెన్స్ పొందిన తయారీదారుల సంఖ్య ఎంత? గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్న కొరతను నివారించేందుకు ఏ చర్యలు తీసుకున్నారో అనే అంశాలపై ఎంపీ డా. కడియం కావ్య స్పష్టత కొరారు.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్ సేవల విస్తరణ
AYUSH సేవలను గ్రామీణ ప్రాంతాలకు చేరవేయడానికి ప్రభుత్వం ఎన్ని మొబైల్ యూనిట్లు పంపిణీ చేసింది? ఇప్పటివరకు ఎన్ని గ్రామాలు వీటి పరిధిలోకి వచ్చాయి? స్థానిక స్వయం సహాయక సంఘాలతో చేపట్టిన సహకార కార్యక్రమాలపై వివరాలు ఇవ్వాలని కోరారు.
ఈ మేరకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి గణపత్రావ్ జాదవ్ సమాధానమిచ్చారు.
2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం “One Earth, One Health” థీమ్‌తో నిర్వహించగా, విశాఖపట్నంలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన మహార్యాలీకి 3.02 లక్షల మంది హాజరయ్యారని మంత్రి తెలిపారు.
దేశవ్యాప్తంగా 13.64 లక్షల యోగ సంగమ్ ఈవెంట్లు నిర్వహించబడినట్లు చెప్పారు.
2024 యోగా దినోత్సవం “Yoga for Self and Society” థీమ్‌తో శ్రీనగర్‌లోని దాల్ సరస్సుపై 7,000 మంది పాల్గొన్న ప్రధాన కార్యక్రమం నిర్వహించగా, జమ్మూ–కాశ్మీర్ జిల్లాల్లో మరో 20,000 మంది పాల్గొన్నారని తెలిపారు.
పుణే, సూరత్, బోధ్ గయాల్లో జరిగిన ప్రీ–ఈవెంట్లకు వేలాది మంది హాజరయ్యారని వివరించారు. 2024–25లో యోగ, ఆయుష్ ప్రచారం కోసం ఐఈసీ పథకం కింద రూ.43.20 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
హర్భల్, ఆయుష్ మందులకు ప్రమాణాలు నిర్ణయించే బాధ్యత ఫార్మకోపియా కమిషన్‌దని మంత్రి తెలిపారు.
ఉత్పత్తి, ఎగుమతులు, మౌలిక వసతులు బలోపేతానికి “AOGUSY” పథకం క్రింద చర్యలు చేపట్టారని చెప్పారు. 34 రాష్ట్ర ల్యాబ్‌లు అప్‌గ్రేడ్ చేయబడి, 108 ల్యాబ్‌లు టెస్టింగ్ కోసం లైసెన్స్ పొందినట్లు వెల్లడించారు.
జాతీయ ఆయుష్ మిషన్ కింద 150 గిరిజన గ్రామాలకు మొబైల్ యూనిట్లు వెళ్లి, 3 లక్షల మందికి ఆరోగ్య పరీక్షలు, మందులు, యోగ తరగతులు అందించాయని మంత్రి తెలిపారు.
‘ఆయుష్ గ్రామం’ ప్రాజెక్ట్ ద్వారా స్వయంసహాయక సమూహాలతో కలిసి ఆరోగ్య అవగాహన, జీవనశైలి మార్పులు, ఇంటివద్ద హర్భల్ చికిత్సలపై ప్రచారం జరుగుతుందని చెప్పారు.
వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం హామీ
గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర హోలిస్టిక్ హెల్త్ సేవల లోటు ఉన్నదన్న వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించి, ఆయా సేవల విస్తరణపై చర్యలు కొనసాగిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.