Homeవరంగల్వరంగల్ ఎంపీ కావ్య: వికలాంగులు, వృద్ధుల పథకాలపై పార్లమెంట్‌లో ప్రశ్నలు

వరంగల్ ఎంపీ కావ్య: వికలాంగులు, వృద్ధుల పథకాలపై పార్లమెంట్‌లో ప్రశ్నలు

న్యూఢిల్లీ ౼ పార్లమెంట్: వికలాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక పథకాల వివరాలపై పార్లమెంట్ లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

వికలాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు…

కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ సహాయ మంత్రి బి.ఎల్. వర్మ వివరణాత్మకంగా వెల్లడించారు.

NIT వరంగల్ 2025–26 ప్లేస్‌మెంట్ బ్రోషర్ విడుదల…

వికలాంగుల పునరావాసాన్ని లక్ష్యంగా పెట్టుకుని అమలు చేస్తున్న ADIP పథకం కింద ఆధునిక సహాయక పరికరాల కొనుగోలు – అమరికకు అర్హులైన వారికి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

సాధారణ సహాయక పరికరాలకు రూ.15,000 వరకు, హై–ఎండ్ కృత్రిమ అవయవాలకు రూ.30,000 వరకు, మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లకు రూ.50,000 వరకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు.

ఆరోగ్య బీమా పథకం ద్వారా సంవత్సరానికి రూ.1 లక్ష ఆరోగ్య బీమా అందుబాటులో ఉంది.

ఇందులో సరిదిద్దే శస్త్రచికిత్సలు (రూ.40 వేల వరకు)..

అవుట్‌పేషెంట్ చికిత్సలు, డయగ్నస్టిక్ పరీక్షలు, థెరపీ సేవలు, ఆయుష్ మందులు, రవాణా భత్యం లాంటి సౌకర్యాలు ఉంటాయని మంత్రిత్వశాఖ వివరించింది.

2025–26 నాటికి మొత్తం 66,356 మంది లబ్ధిదారులు నమోదు కాగా, ఇప్పటివరకు రూ.9.9 కోట్లు ఖర్చయినట్లు తెలిపింది.

వృద్ధుల కోసం అమలులో ఉన్న అటల్ వయో అభ్యుదయ యోజన (AVYAY) కింద గౌరవప్రదమైన జీవనం కోసం అనేక సేవలను సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించింది. 2014–15 నుండి ఇప్పటివరకు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ద్వారా 10.20 లక్షల మంది వృద్ధులకు ఆశ్రయం, ఆహారం, వైద్య సేవలు అందించబడినట్లు చెప్పింది.

రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలు, వృద్ధులకు ఉచిత సహాయక పరికరాలు అందించే సహాయం కోసం 14567 ఎల్డర్‌లైన్ హెల్ప్‌లైన్..

2023–24లో ప్రారంభమైన జిరియాట్రిక్ కేర్‌గివర్‌ల శిక్షణ వంటి కార్యక్రమాలు ప్రధాన భాగాలని తెలిపింది.

అంతే కాకుండా ఆయుష్ శాఖతో ఆరోగ్య సేవల కోసం ఒప్పందాలు, బ్రహ్మకుమారీస్‌తో ఆధ్యాత్మిక ఆరోగ్య కార్యక్రమాలు, డిమెన్షియా అవగాహన కార్యక్రమాలు, డిజిటల్ లిటరసీపై శిక్షణ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు.

జాతీయ సామాజిక భద్రతా పథకం (NSAP) కింద ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ రూ.200 నుంచి రూ.500 వరకు మాత్రమే ఉండి, పెంపుపై ఎలాంటి ప్రతిపాదనలూ లేవని మంత్రి స్పష్టం చేశారు.

ఎన్‌జీవోలు, సంస్థల ద్వారా అవగాహన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ పథకాలన్నీ వికలాంగులు, వృద్ధుల స్వాభిమానాన్ని, సక్రియ జీవనశైలిని ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి శ్రీ బి.ఎల్. వర్మ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments