Big Breaking News
మాగంటి గోపినాథ్ అసలైన వారసుడిని నేనేనని ఈసీకి ఫిర్యాదు చేసిన కుమారుడు తారక్ ప్రద్యుమ్న
మాజి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తన అసలైన వారసుడిని తానొక్కడినేనని కుమారుడు తారక్ ప్రద్యుమ్న ఎన్నికల సంఘానికి సంచలన ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో ఆయన పేర్కొన్న వివరాలు:
మాగంటి గోపినాథ్ సునీతను వివాహం చేసుకోలేదని తారక్ ఆరోపించారు.
గోపినాథ్ మరియు సునీత లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు.
తన తల్లి మాలినీదేవికి మాగంటి గోపినాథ్ విడాకులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
పెళ్లి జరగనప్పుడు, సునీత ఎన్నికల అఫిడవిట్‌లో గోపినాథ్‌ను భర్తగా పేర్కొనడంపై తారక్ ప్రద్యుమ్న అభ్యంతరం తెలిపారు.