దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైని పేరొందిన NIT వరంగల్… 1959 నుంచి ఇంజనీరింగ్ విద్యలో మైలురాయిగా నిలిచిన ఈ సంస్థ, 2025–26 సీజన్ కోసం కొత్త ప్లేస్మెంట్ బ్రోషర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ బ్రోషర్లో విద్యార్థుల టాలెంట్‌ను ప్రపంచ స్థాయి కంపెనీల ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని వివరాలూ ఒక్క చోట చేర్చారు.
డైరెక్టర్ గారి సందేశం – భవిష్యత్‌ను రూపొందించే దృక్పథం
“మేం కేవలం ఇంజనీర్లను తయారు చేయడం లేదు… సమాజ సమస్యలను పరిష్కరించగలిగిన ఆలోచనాపరులను, స్టార్టప్ వ్యవస్థాపకులను, గ్లోబల్ లీడర్లను తయారు చేస్తున్నాం.” – ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి

గతేడాది టాప్ రిక్రూటర్లు
- సాఫ్ట్వేర్ & ఐటీ: Microsoft, Google, Adobe, Oracle, ServiceNow
- కోర్ & PSU: Vedanta, L&T, Tata Steel, BPCL, IOCL
- ఫైనాన్స్ & కన్సల్టింగ్: Goldman Sachs, JPMorgan, Deloitte, PwC
- స్టార్టప్స్ & యూనికార్న్స్: Flipkart, Swiggy, Zerodha, PhonePe

గత సీజన్లో 92%కుపైగా ప్లేస్మెంట్ రేటు… ఈ ఏడాది 95% శాతం లక్ష్యంగా పెట్టుకున్నారు.
బ్రాంచి వారీగా ఆఫర్లు (తాజా ట్రెండ్స్)
- కంప్యూటర్ సైన్స్: గరిష్టంగా ₹88 లక్షలు (గతేడాది రికార్డు)
- ఎలక్ట్రానిక్స్: సగటు ₹22 లక్షలు
- మెకానికల్ & సివిల్: కోర్ కంపెనీల నుంచి భారీ ఆఫర్లు

క్యాంపస్ ఎకోసిస్టమ్
- 40+ స్టూడెంట్ క్లబ్స్ & చాప్టర్లు (IEEE, ASME, CSI మొ.)
- టెక్నోజియన్ – దేశంలోనే అతిపెద్ద టెక్ ఫెస్ట్ (50,000+ ఫుట్‌ఫాల్
- స్ప్రింగ్‌స్ప్రీ – సెలబ్రిటీ నైట్స్‌తో కల్చరల్ ఎక్స్‌ట్రావగంజా
- ఇన్నోవేషన్ & ఇంక్యుబేషన్ సెంటర్లో 30+ స్టార్టప్స్ ఇప్పటికే రన్ అవుతున్నాయి
వరంగల్ ఇప్పుడు తెలంగాణలోనే రెండో అతిపెద్ద ఐటీ హబ్‌గా ఎదుగుతోంది. NITW ప్లేస్‌మెంట్స్‌లో స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ బ్రోషర్తో ఈ ఏడాది మరిన్ని మల్టీ నేషనల్ కంపెనీలు వరంగల్ క్యాంపస్‌కు రావడం ఖాయం.